102 Ambulance | గర్భిణీలకు సౌకర్యవంతమైన సేవలు

102 Ambulance | గర్భిణీలకు సౌకర్యవంతమైన సేవలు

  • గర్భిణీ స్త్రీలను ఇళ్ల వద్దకు చేర్చిన 102 అంబులెన్స్

102 Ambulance | నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి గర్భిణీ స్త్రీలను ఆరోగ్య పరీక్షల కోసం సౌకర్యవంతంగా తీసుకువచ్చి, చెకప్ అయిన తర్వాత మళ్లీ ఇంటి దగ్గరే దింపుతున్న 102 అంబులెన్స్ సేవలు గ్రామీణ మహిళలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ అంబులెన్స్ (కెప్టెన్ పాపయ్య) మండలంలోని దూరంగా ఉన్న గ్రామాల నుండి గర్భిణీలను సురక్షితంగా PHCకి తీసుకువచ్చి, తిరిగి ఇంటి వద్దే దింపుతోంది. ఈ సేవలు గ్రామస్తుల్లో ఆరోగ్య అవగాహన పెరగడంతో పాటు, గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లడానికి ఉన్న ఇబ్బందులను గణనీయంగా తగ్గించాయి.

Leave a Reply