ZP High School | బ‌డిలో భోజ‌నం బాగుంది..

ZP High School | బ‌డిలో భోజ‌నం బాగుంది..

  • క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ

ZP High School | నాగాయలంక, ఆంధ్రప్రభ : నాగాయలంక జెడ్పీపాఠశాలలో విద్యాబోధన, మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణ బాగున్నాయని కలెక్టరు డీకే బాలాజీ తెలిపారు. శుక్రవారం స్థానిక జెడ్పీ పాఠశాల(ZP school) లో పేరెంట్స్, టీచర్స్ సమావేశం సందర్భంగా మధ్యాహ్న భోజనం పథకాన్ని ఆయన తనిఖీ చేశారు. తల్లిదండ్రులతో కలసి భోజనం చేసి సంతృప్తి(Satisfied)ని వ్యక్తం చేశారు. అనంతరం విద్యాబోధన ఎలా ఉందని కలెక్టరు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆయన అడిగి తెలుసుకున్నారు.

ZP High School

పాఠశాలలోని సైన్స్ ల్యాబ్‌(Science Lab)ని కలెక్టరు పరిశీలించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన విద్యార్థులను అభినందించారు. అనంతరం నాగాయలంక సెంటరులో డీఆర్డీఎ( వెలుగు) పథకం ఆర్థిక సాయంతో నడుపుతున్న శ్రీ శ్రీనివాస గ్రామ సంఘం సభ్యురాలు మేడ నాగ బసవమ్మ బెల్లం టీ షాపును, గుల్లలమోదలో డీఆర్డీఎ( వెలుగు) పథకం ద్వారా మత్స్యకారులు(Fishermen) నిర్వహిస్తున్న పడవల తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టరు బాలాజీ, డీఆర్డీఏ అధికారులతో కలసి పరిశీలించారు.

ఆదాయం గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీరాంజనేయ ప్రసాద్, సర్పంచి కైతేపల్లి అంకాలు, అగ్నికుల క్షత్రియ సంఘం ఛైర్మన్ చిలకలపూడి పాపారావు(Chilakalapudi Paparao), తలశిల స్వర్ణలత, ప్రధానోపాధ్యాయులు ఎ.సత్యనారాయణ విద్యాకుటుంబం పాల్గొన్నారు.

Leave a Reply