Zahirabad | కాంగ్రెస్ పాలనలో మహిళలకే పెద్దపీట – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రూ. 494 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

ఉమ్మడి మెదక్ బ్యూరో, (ఆంధ్ర ప్రభ): సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి బాట కింద శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 494.67 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత కేంద్రీయ విద్యాలయం అనంతరం పస్తాపూర్‌ సభాస్థలి వద్ద జహీరాబాద్‌ నియోజకవర్గంలో రూ.100 కోట్లతో నిర్మించిన 9 కిలో మీటర్ల గ్రీన్ కారిడార్ నిమ్జ్‌ రోడ్డు, రూ.100 కోట్లతో జహీరాబాద్‌ పట్టణంలో నిర్మించిన రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు.చిరాగ్‌పల్లి-ఇప్పపల్లి గ్రామాల మధ్య రూ.20 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కస్తూర్బా గాంధీ విద్యాలయం( గుమ్మడిదల) ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు, మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పస్తాపూర్‌ సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్ లను సందర్శించిన మహిళా సంఘాలతో ముచ్చటించారు.


అనంతరం రూ.2 కోట్ల తో 3 షిఫ్ట్ ల వారిగా మహిళా సహకార సంఘాలు నిర్వహించబోయే ఇండియన్ ఆయిల్ ఔట్ లెట్ ను ప్రారంభించారు.

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మహిళలకు పెద్ద పీట వేస్తుందని, మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా మద్దతుగా, వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు. కుటుంబానికి మహిళే వెన్నుముక అని మహిళ రాణిస్తే కుటుంబం మొత్తం రాణిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, ఎంపీ సురేష్ షట్కర్, టీ జీ ఐఐ సీ ఛైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ పరితోష్ పంకజ్, మెదక్ ఎంపీ కాంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు, నిమ్జ్ అధికారులు,
మేఫ్మా అధికారులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply