YSRCP | అంబటి రాంబాబు 7 క్వాష్‌ పిటిషన్లు

YSRCP | అంబటి రాంబాబు 7 క్వాష్‌ పిటిషన్లు

YSRCP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైఎస్ఆర్పీసీ నేత అంబటి రాంబాబుపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం విదితమే. అయితే తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో మొత్తం ఏడు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు.

పట్టాభిపురం, నగరం పాలెం, మంగళగిరి, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసులను కొట్టివేయాలని ఆయన కోరారు. నల్లపాడు కేసు విచారణను ఈ నెల 11కి హైకోర్టు వాయిదా వేసింది. మంగళగిరి పోలీసులకు 35(3) BNSS ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాలని హైకోర్టు ఆదేశించింది. మిగిలిన ఐదు కేసుల విచారణ వచ్చే సోమవారం జరిగే అవకాశం ఉంది. ఈ కేసులపై హైకోర్టు నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave a Reply