ఉదయ్ భాను చిబ్ వెంటనే విడుదల చేయాలి..

ఉదయ్ భాను చిబ్ వెంటనే విడుదల చేయాలి..

  • యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ని విడుదల చేయాలి,
  • రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఓరుగంటి మహిపాల్ రెడ్డి,

చిట్యాల, ఆంధ్రప్రభ : యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ వెంటనే విడుదల చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి , భూపాలపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్ లు డిమాండ్ చేశారు. మండలం కేంద్రంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఓరుగంటి మహిపాల్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్,లు పాల్గొని మాట్లాడుతూ,యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం బాధాకరం అన్నారు. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో నిరసన తెలిపినందుకు అరెస్టు చేశారు.

ఆయనతో పాటు మరో 7 మందిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం తగదన్నారు . ఉదయ్ భాను చిబ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చుంచుల మహేష్, అసెంబ్లీ అధ్యక్షులు నమునూరి రజినీకాంత్, మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ ,చిట్యాల మండల యూత్ నాయకులు దూడపాక సురేష్, వెలగొండ చిరంజీవి, కంచర్ల రాంబాబు, కంచు శ్రీకాంత్, కట్ల మహేష్, తీగల నాగరాజు, చిట్యాల టౌన్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముస్కే శ్రీధర్ , నాగరాజు, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply