సంచలనం రేపుతున్న యువతి పోస్ట్

సంచలనం రేపుతున్న యువతి పోస్ట్

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్(BRS) మహిళా కార్యకర్త చేసిన ఒక పోస్టు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నా చావుకు కార‌ణం కేటీఆరే అంటూ ఆ మహిళ పెట్టిన పోస్ట్ అందర్నీ షాకింగ్ కి గురిచేస్తుంది. ఆమె పేరు ఆశ‌ప్రియ‌. బీఆర్ఎస్ మాజీ కార్యకర్త. బీఆర్ఎస్ సోషల్ మీడియా తనపై వేధింపులకు గురిచేస్తుంద‌ని, ఎన్నిసార్లు చెప్పినా కూడా తనని టార్చర్(Torture) చేస్తున్నారని, ముఖ్యంగా హెచ్ ఎస్, పీజేఎంఆర్, కేటీఆర్ వీళ్లు ముగ్గురు త‌న‌ చావుకు కారణమని పేర్కొంది.

ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికి త‌న‌ నుండి ఏ పోస్టు రాకపోతే తాను చనిపోయినట్టే అర్థం చేసుకోండి అంటూ సంచలన పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా తనని వేధించిన ఆధారాలు అన్నీ కూడా వాట్సాప్ సెల్ఫ్ చాట్ లో ఉన్నాయ‌ని వివ‌రించింది.

ఇదే తన మరణం వాంగ్మూలం అని, చనిపోకుండా బీఆర్ఎస్ పై కేసు నమోదు చేస్తే కచ్చితంగా వాళ్ళు బెయిల్(Bail)తో బయటికి వస్తార‌ని, అందుకే ఇలా చేస్తున్నాను అంటూ ఆశ‌ప్రియ‌ తెలియజేసింది. ప్రస్తుతం బీఆర్ఎస్ మాజీ మహిళా కార్యకర్త ఆశప్రియ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారడంతో చాలామంది షాక్ అవుతున్నారు.

ఇక మహబూబ్ నగర్ జిల్లా(Mahbubnagar Distt)లోని బీఆర్ఎస్ కార్యకర్త ఆశప్రియ ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చాలా చురుకుగా ఉండేది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ విషయం అయినా సరే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉండేది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పింది.

ఆమె బిఆర్ఎస్ పార్టీ నుండి తప్పుకోవడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా(Social Media) ఆమెపై నెగిటివ్ కామెంట్లు చేస్తూ వేధిస్తున్నారని ఆ మహిళ తెలిపింది. సోషల్ మీడియాలో ఎవరైతే తనని వేధిస్తున్నారో వారి గురించి తన ట్విట్టర్ ఖాతాలో ఒకరు త‌న‌ను వేధిస్తున్నారని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని, తెలిపింది. అలాగే కొన్ని స్క్రీన్ షాట్లు(Screen Shots) కూడా షేర్ చేసింది. ఏది ఏమైనప్పటికీ ఆశప్రియ మరణిస్తే అది బీఆర్ఎస్‌కు చెడ్డ పేరు తెచ్చే అవ‌కాశం ఉంది.

Leave a Reply