పాతగుంటలో ఉరకలేసిన ఉత్సాహం..

పాతగుంటలో ఉరకలేసిన ఉత్సాహం..

కోలాహలంగా పశువుల పండుగ
కోడిగిత్తల జోరు బేజారు పడ్డ యువకులు
వేల సంఖ్యలో జనం – వందల సంఖ్యలో పశువులు
ప్రశాంత వాతావరణంలో ముగిసిన పండుగ

వెదురుకుప్పం, ఆంధ్రప్రభ : వెదురుకుప్పం మండలంలోని పాతగుంట గ్రామంలో ఉగాది వేడుకల్లో భాగంగా ఆదివారం గ్రామస్తులు ఐక్యమత్యంతో పశువుల పండుగను (జల్లికట్టు )అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు, యువకులు, పెద్దలు కలిసి సుమారు వారం రోజులపాటు గ్రామంలో పశువులు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చుట్టుపక్క గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఎద్దుల యజమానులు ఎద్దులను పట్టుకొని గ్రామానికి చేరారు.

అధిక సంఖ్యలో పశువులు రావడంతో గ్రామాలలో ఒక సారి గా సందడి నెలకొంది. మధ్యాహ్నం సమయంలో గ్రామస్తులు, సర్పంచ్ భువనేశ్వరి (బోజ్జా రెడ్డి), కూటమి నాయకులందరు కలిసి గ్రామ నడివీధిలో అల్లిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.ఈ పండుగలు ఎద్దులు దుమ్ము రేపుతూ యువకుల మధ్యలో వెళుతుంటే యువకులు కాలు దువ్వి ఎలాగైనా పశువులను పట్టేందుకు ప్రయత్నించిన యువకులు విపలమైయ్యారు.

ఈ పండుగలో యద్ధలకు..యువకులు కు మధ్య పోటాపోటీగా జరిగింది.మిధుల పైన, చెట్లు పైన, ప్రహరీ గోడల పైన, పొలాల వెంట ఎక్కడ చూసినా ప్రజలతో పాతగుంట గ్రామం సముద్రంగా మారింది. ఈ పండుగలో ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్తులు, యువకులు గట్టి ఏర్పాట్లు చేశారు. సుధీర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, పండుగ ను విజయవంతం చేశారు.

Leave a Reply