WAR | ప్రధాని మోడీ కీలక సమావేశం

WAR | ప్రధాని మోడీ కీలక సమావేశం

WAR | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నేడు ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ కానున్నారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడి చమురు, పెట్రోల్ ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి. అలాగే ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనుంది. పరిశ్రమలు, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు అన్ని అవకాశాలను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

పశ్చిమాసియా యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని మోడీ కేంద్రమంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఎరువుల ఉత్పత్తికి ఎల్‌ఎన్‌జీ కొరత లేకుండా చూడాలని సూచించారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎల్‌పీజీ, సిఎన్‌జీ సరఫరాకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ముడి చమురు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరారు. ధరల స్థిరీకరణ, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని కేంద్ర మంత్రులకు సూచించారు.

Leave a Reply