యువ‌కుడి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

యువ‌కుడి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

ధ‌ర్మ‌పురి, ఆంధ్ర‌ప్ర‌భ : జగిత్యాల జిల్లా(Jagityala District) ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన ఓ యువ‌కుడు త‌న‌కు వ్యాధి న‌యం కాలేద‌ని మ‌న‌స్తాపం చెంది బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం దమ్మన్న పేట గ్రామానికి చెందిన జగిశెట్టి సచిన్ అలియాస్ వినయ్(Jagishetti Sachin alias Vinay) గత కొంతకాలంగా వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నాడు.

ఇటీవల హైదరాబాద్ ఓ హాస్పిటల్లో వెర్కోస్ ఆపరేషన్(Vercos Operation) జరిగి డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాడు. మళ్లీ వ్యాధి తిరగ బడడంతో మనస్తాపం గురైన వినయ్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply