Young India – మహిళల ప్రపంచ కప్ మనదే – ఫైనల్ లో దక్షిణాఫ్రికా పై ఘనవిజయం

కౌలాలంపూర్ – మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్ భారత్ మరో సారి కైవసం చేసుకుంది . కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న తుది పోరులో దక్షిణాఫ్రికా ను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది ,

సఫారీ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని, టీమ్ఇండియా అమ్మాయిలు 11.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించారు. గొంగడి త్రిష (44 పరుగులు; 33 బంతుల్లో: 8×4) స్వల్ప ఛేదనలో అదరగొట్టింది. సనికె చక్లె (26 పరుగులు) రాణించింది.

సౌతాఫ్రికా బౌలర్లలో రెనెకె 1 వికెట్ దక్కించుకుంది.అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది.

భారత బౌలర్ల విజృంభనతో సఫారీ జట్టు విలవిల్లాడింది. మికీ వాన్ (23 పరుగులు)టాప్ స్కోరర్. నలుగురు ప్లేయర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. టీమ్ఇండియా బౌలర్లలో త్రిష 3, పరునిక, ఆయూషి, వైష్ణవి తలో 2, షబ్నమ్ 1 వికెట్ దక్కించుకున్నారు..

అదరగొట్టిన తెలుగమ్మాయి

ఈ టోర్నీలో తెలుగమ్మాయి గొంగడి త్రిష అద్భుతంగా రాణించింది. ఇప్పటికే టోర్నీలో సెంచరీ బాదేసింది. ఫైనల్లోనూ మూడు వికెట్లతో రాణించింది గొంగడి త్రిష (44*) ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. మరో ఓపెనర్ కమలిని (8) తక్కువ స్కోర్‌కే ఔట్ అయినా.. వన్ డౌన్లో వచ్చిన సనికా చాల్కేతో (26*) కలిసి త్రిష టార్గెట్ ఫినిష్ చేసింది. ఇక, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన త్రిషకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అవార్డు దక్కింది.

ఇక, ఈ కప్ గెలుచుకోవడంతో.. టీ20 అండర్ 19 ట్రోఫీని భారత్ వరుసగా రెండోసారి గెలిచినట్లు అయింది. 2023లో సౌతాఫ్రికాలో మొదటిసారి నిర్వహించిన ఈ టోర్నమెంట్‌ను కూడా భారత్ కైవసం చేసుకుంది. ఆ టోర్నీలో ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై తలపడి గెలుపొందింది

.

. .

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *