Yemen | చివ‌రి నిమిషంలో ఊపిరి .. నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా

ఫ‌లించిన కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్చ‌లు
రంగంలోకి దిగిన మ‌త పెద్ద‌లు
క్ష‌మాధ‌నం ఇచ్చేందుకు బాధిత కుటుంబీకుల‌తో మంత‌నాలు
వాస్త‌వానికి రేపే ఆమెకు ఉరి
చివ‌రి క్ష‌ణంలో వాయిదా వేసిన యెమ‌న్ ప్ర‌భుత్వం ..

న్యూ ఢిల్లీ – హ‌త్య కేసులో (murder case ) దోషిగా యెమెన్‌లో (Yemen ) మరణశిక్ష (death sentence ) ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియకు (kerala nurse nimisha priay ) చివ‌రి నిమిషంలో తాత్కాలిక ఊర‌ట ల‌భించింది.. బ్ల‌డ్ మ‌నీ (Blood Money ) – క్ష‌మాధ‌నం ఇచ్చే విష‌యంలో బాధిత కుంటుంబీకుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న నేప‌థ్యంలో ఆమె మ‌ర‌ణ శిక్ష‌ను తాత్కాలికంగా నిలిపి (temporary stop ) వేస్తున‌ట్లు యెమ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది..

ఈ మ‌ర‌ణ‌శిక్ష‌ను నిలుపుద‌ల చేయించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రిపిన కేంద్రం ఎట్ట‌కేల‌కు మ‌ర‌ణ శిక్ష‌ను వాయిదా వేయించ‌గ‌లిగింది.. ఇదే స‌మ‌యంలో ‘బ్లడ్‌ మనీపై ఇప్పటికే బాధిత కుటుంబంతో రత్‌కు చెందిన ఓ ప్రముఖ మత గురువు చర్చలు జరుపుతున్నారు. నిమిష ప్రియ ను శిక్ష నుంచి తప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ కేసులో గ్రాండ్ ముఫ్తీ ఆఫ్‌ ఇండియా అబూబకర్‌ ముస్లియార్‌ మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధిత కుటుంబంతో పాటు యెమెన్ స్థానిక అధికారులు, అక్కడి మత పెద్దలతో ఆయన మాట్లాడుతున్నారు. బ్లడ్ మనీని అంగీకరించేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించ‌డంలో మ‌త గురువు విజ‌యం సాధించిన‌ట్లు స‌మాచారం .. దాదాపు మిలియ‌న్ డాల‌ర్లు భార‌త క‌రెన్సీలో 8.60 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిన‌ట్లు యెమ‌న్ నుంచి వార్త‌లు వ‌స్తున్నాయి.. బాధిత కుటుంబీకులు క్ష‌మాప‌త్రంపై సంత‌కం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు మ‌త గురువు ప్ర‌క‌టించారు.. ఇదే విష‌యాన్ని స్థానిక ప్ర‌భుత్వానికి స‌మాచారం ఇచ్చారు.. ఈ నేప‌థ్యంలోనే నిమిషకు శిక్ష అమ‌లును నిలిపివేస్తూ అక్క‌డి ప్ర‌భుత్వ ఆదేశాలు జారీ చేసింది..ఇదే విష‌యాన్ని భార‌త ప్ర‌భుత్వానికి కూడా తెలిపింది..

Leave a Reply