Yedapally | మిషన్ భగీరథ పైప్ పగిలి నీటి వృథా..

Yedapally | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం మంగల్ పాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో రోడ్డుపై మిషన్ భగీరథ నీటి పైప్ పగిలి నీరు వృథాగా పోతుండటంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకీ తాగునీటి కొరత పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ విధంగా నీరు వృథా కావడం బాధాకరమని వారు పేర్కొన్నారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పైప్‌కు మరమ్మత్తులు చేపట్టి నీటి వృథాను నివారించాలని గ్రామస్తులు కోరారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

