నకిలీ మద్యంపై భారీ ర్యాలీ
(అనంతపురం, ఆంధ్ర ప్రభ బ్యూరో) : నకిలీ మద్యం (Illegal liquor) తయారీని ఒక పరిశ్రమాలా మార్చి, దానిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల (TDP leaders) వైఖరి.. కూటమి ప్రభుత్వం మద్యం విధానాలకు వ్యతిరేకంగా అనంతపురం నగరంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన కార్యక్రమం కొనసాగించారు.
వైసీపీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టిన నాయకులు, కార్యకర్తలు నగరంలోని ప్రకాష్‌రోడ్డులో ఉన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ (Prohibition and Excise Department) కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వైసీపీ శ్రేణులు తెలిపారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చేవరకు ధర్నా విరమించేది లేదని భీష్మించిన వైఎస్ఆర్సిపి శ్రేణులు అన్నారు.

