yadagirigutta | నారసింహుని సేవలో ఎమ్మెల్యే కుంభం దంపతులు

yadagirigutta | నారసింహుని సేవలో ఎమ్మెల్యే కుంభం దంపతులు
yadagirigutta | ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఎమ్మెల్యే దంపతుల దర్శనం
పూర్ణకుంభంతో ఘన స్వాగతం
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహణ
వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాల అందజేత
ప్రజల సుఖసంతోషాల కోసం ఎమ్మెల్యే ఆకాంక్ష
ఆంధ్రప్రభ ప్రతినిధి, యాదాద్రి : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభంతో అర్చక స్వాములు ఆయనను ఆహ్వానించారు.

అనంతరం స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఈఓ భవాని శంకర్ స్వామివారి తీర్థ ప్రసాదాలను, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తంగళ్లపల్లి రవికుమార్, పొతంశెట్టి వెంకటేశ్వర్లు, ఆలయ సిబ్బంది మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

