Yadadri | రేపటి నుంచి బడికి వచ్చేయ్..
Yadadri, యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి : మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేను చూసుకుంటా.. నువ్వు మాత్రం రేపటి నుండి రోజు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లి మంచిగా చదువుకోవాలని కలెక్టర్ (Collector) హనుమంతరావు అన్నారు. గురువారం భవనగిరి మున్సిపాలిటీలో సింగన్నగూడెంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న పదవ తరగతి విద్యార్థిని బానోతు సుస్మిత పాఠశాలకు హాజరు కాకపోవడంతో ఇంటికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఇంట్లో పరిస్థితి పై ఆరా తీశారు.
ఇంట్లో వాళ్ల అమ్మకు ఆరోగ్యం సరిగాలేదని, ఆమె పనికి వెళతారని అమ్మకు తోడుగా ఎవరూ లేకపోవడం వలన ప్రతి రోజు బడికి వెళ్లలేకపోతుందని కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ సుస్మిత ఇంటికి వెళ్లిన సమయంలో వాళ్ల అన్నయ్య అమ్మను తీసుకుని ఆసుపత్రికి వెళ్లినట్లు తెలిపారు. విద్యార్థిని స్కూల్ కు రాని రోజు ఇంటి వద్ద ఉండి చదువుకోవడానికి సదుపాయాలు సరిగా లేవని తెలుసుకుని స్టడీ ఛైర్, రైటింగ్ పాడ్ అందచేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

