Womens | భావితరాలకు స్ఫూర్తి..

Womens | భావితరాలకు స్ఫూర్తి..

  • ఘ‌నంగా సావిత్రిబాయి పూలే జ‌యంతి

Womens | ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యతో మహిళలకు విముక్తి దీపం వెలిగించిన సావిత్రిబాయి పూలే భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఊట్కూర్ మండల అంబేద్కర్ సంఘ అధ్యక్షులు కొక్కు శంకర్, మాజీ జెడ్పీటీసీ సూర్యప్రకాశ్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 195వ జయంతి పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా, భారతదేశ సామాజిక చరిత్రలో చేసిన విప్లవాత్మక పోరాటాన్ని స్మరించుకోవడం ప్రతి పౌరుని కర్తవ్యం అన్నారు. మహిళా విద్య, సామాజిక సమానత్వం, మానవత్వం కోసం ఆమె సాగించిన పోరాటం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని కొనియాడారు. స్త్రీ అంటే ఓ నీడ కాదు ఓ సృష్టికర్త” అనే భావనను తన రచనలు, జీవితం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన తొలి రచయిత్రి సావిత్రిబాయి పూలే అన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భరత్, ఉప సర్పంచ్ రమేష్ వార్డు మెంబెర్స్ కోక్కు మల్లేష్, కొక్కు లక్మణ్, నరేష్, అక్షయ్, రవి, సందపురం రవి, తిమ్మప్ప కోరం శివ రెడ్డి, కోరం మహేష్ మాజీ అధ్యక్షులు తిమ్మప్ప, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply