MLA| మహిళలు ఆర్థికంగా ఎదగాలి..

  • ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

MLA| చెన్నారావుపేట, ఆంధ్రప్రభ: మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి ప్రభుత్వం అందించే గ్రాంట్స్ ను ఉపయోగించుకుని వ్యవసాయం, కుల వృత్తుల ద్వారా కాకుండా వివిధ రంగాల్లో నెలకు రూ. 5వేలు సంపాదించే మహిళలకు ఎంత మంది మహిళలలైనా వచ్చే సంవత్సరం ఇదే రోజూ వారు కోరుకున్న చోటా (గద్వాల, పోచంపల్లి) నాణ్యమైన ఎంత ఖరీదైనా చీరనైనా తన స్వంత డబ్బులతో ఉచితంగా అందిస్తానని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళామణులకు ఉచితంగా అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో చెన్నారావుపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే దొంతి శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ.. గతంలో మహిళా సంఘాలకు పావలా వడ్డీకి, వడ్డీ లేని రుణాలు అందించిన ఘనత కాంగ్రేస్ ప్రభుత్వానిదేనని అన్నారు. స్వయం సహాయక మహిళా సంఘం సభ్యుల్లో తారతమ్యం బేధాలు లేకుండా అందరికి ఒకే రకమైనా రంగు కలిగిన యూనిఫామ్ చీరలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. మండలంలోని ఆశాజ్యోతి మండల మహిళా సమాఖ్యలో ఉన్న 9,680 మందికి చీరలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఆర్డీవో ఉమారాణి, మండల ప్రత్యేక అధికారి డా.బాలకృష్ణ, తహసీల్దార్ మహ్మద్ అబిద్ అలీ, ఎంపీడివో వెంకట శివానంద్, ఏపీఎం తిలక్, ఏవో గోపాల్ రెడ్డి, మండల కాంగ్రేస్ అధ్యక్షుడు సిద్దన రమేష్, మహిళా సమాఖ్య పాలకవర్గం, మహిళలు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply