• త‌ల్లీబిడ్డ క్షేమం..!


జైనూర్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా జైనూర్ మండలంలోని ఆశ పెల్లి గ్రామానికి చెందిన మహిళ సంగీతకు పురిటి నొప్పులు రావడంతో 108కు స‌మాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్ లో ఉట్నూర్ (Utnoor) ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సలు చేసి వైద్యులు సూచ‌న మేర‌కు ఆదిలాబాద్ (Adilabad) కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె ప్ర‌స‌వించి ఆడ బిడ్డ‌కు జన్మనిచ్చింది.

ఇద్ద‌రూ త‌ల్లీబిడ్డ క్షేమంగా ఉన్నార‌ని ఈ ఎంపీ ప్రశాంత్ పైలెట్ రవిలు తెలిపారు. అనంతరం ఆసుపత్రిలో చేర్పించారు. అంబులెన్స్ సిబ్బందికి ఆ మ‌హిళ కుటుంబ స‌భ్యులు, ఆశ‌పెల్లి గ్రామ‌స్థులు కృతజ్ఞ‌త‌లు తెలిపారు.

Leave a Reply