సన్నీ సంజయ్ దర్శకత్వంలో సుమంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మూవీ ‘అనగనగ’. రాకేష్ రెడ్డి గడ్డం, రుద్ర మాదిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ చౌదరి కథానాయికగా కనిపించనుంది.. కాగా, ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను సృష్టించింది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 15 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు.