సీఎంకే  క్రెడిట్

భళా.. కాంగ్రెస్ టీమ్

జూబ్లీహిల్స్ లో పాగా సూపర్ గురూ  

( ఆంధ్రప్రభ, వెబ్​ డెస్క్) ​

రోజులు మారాయి. సానుభూతితో పని లేదు. పోయినోళ్లు మంచొళ్లు. ఉన్నోళ్లతోనే సఖ్యత అత్యవసరం. ఇదీ  ఓటర్ల మనోగతి.    నాయకులు అందుబాటులో ఉండాలి. బాధ పడితే అక్కున చేర్చుకోవాలి. ఈ లక్షణాలు ఉంటేనే జనం దరి చేరుతారు. కన్నీళ్లు పట్టించుకోరు. తిట్లు అసలు భరించరు. సరీగా జూబ్లీహిల్ jublihills consistuency) నియోజకవర్గంలో ఎన్నికల ఫలితం అద్ధం పడుతోంది. 2014లో చేజారిన జూబ్లీహిల్స్ నియోజక వర్గాన్ని ఎట్టకేలకూ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. ఇక్కడ విజేత నవీన్ కుమార్​  యాదవ్ (Naveen Kumar Yadav) .. రెండు సార్లు వేర్వేరు పార్టీల గొడుగులో ఓడిపోయి.. కడకు బీఆర్ఎస్ (BRS Port)  కంచుకోటలో పాగా వేశారు. ఈ ఎన్నికలు సాదాసీదాగా జరగలేదు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి 9 Telangana CM Revant Reddy) కి డూ ఆర్ డై పరిస్థితి. తన పరిపాలన దక్షతకు.. కాంగ్రెస్ పార్టీలో తన పలుకుబడికి ఓ అగ్నిపరీక్షే. వాస్తవానికి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి సానుకూలం కాదు. భర్త వియోగంతో రాజకీయ వాకిట్లోకి వచ్చిన దివంగత గోపీనాథ్ సతీమణి సునీత (Sunitha)  ఈ ఎన్నికల్లో ఆలవోకగా గెలుస్తారని అంచనాలు వేశారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గోపీనాథ్ (Gopi Nath)  నిత్యం జనంలో మెదిలారు. ఆ అభిమానం ఎక్కడికి పోదు.. ఈ స్థితిలో గోపీనాథ్ సతీమణిని రంగంలోకి దించితే జూబ్లీ హిల్స్ సీటు తమ చేతిలోనే ఉంటుందని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. కానీ ఇక్కడ సానుభూతికి (Sympathi) జనం తలొగ్గలేదు. ఇక నవీన్ యాదవ్ పట్ల బీఆర్ఎస్ విరుచుకు పడిన తీరు.. సామాన్య జనంలో చిరాకు పెంచింది. ఫలితంగా నవీన్ యాదవ్ పట్ల సానుభూతి పెరిగింది. అంతే 24 వేల ఓట్లతో జనం ఓడించారు. ఇందులో కుల (Caste) సమీకరణలు, మతాలు (Relioson), ప్రాంతాలు (Areas).. ఇలా అనేక అంశాలు నవీన్ యాదవ్  విజయానికి ఎలా దోహదపడ్డాయో? పరిశీలిద్దాం.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి (BRS)  ఎందుకు ఓడిపోయింది? సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.  బీఆర్ఎస్ అభ్యర్థిగా  మాగంటి సునీతను బీఆర్ఎస్ రంగంలోకి దించింది.  కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్‌( Exit Polls)లో కొన్ని సర్వే (survey)సంస్థలు  కాంగ్రెస్‌కు 46-48% ఓట్లు, బీఆర్ఎస్‌కు 41-44%  ఓట్లు వస్తామని  అంచనా వేశాయి. అందుకు అనుగుణంగా ఎన్నికల ఫలితం వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 79,290 ఓట్లు, బీఆర్ ఎస్ అభ్యర్థిని  మాగంటి సునీతకు  50,519 ఓట్లు,  బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి  11,903 ఓట్లు లభించగా.. 24,658 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు.

బలమైన ప్రచారం.. కుల పునాది

అభ్యర్థి ఎంపికలో కనపర్చిన శ్రద్ధ.. ప్రచారంలో లేదని విమర్శలు తెరమీదకు వచ్చాయి. అప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని (Brs Candidate) నియోజకవర్గంలోని గడప గడప (House to House) కు చేరి తపను గెలిపించాలని ప్రాధేయపడ్డారు. ఒక్కసారిగా కాంగ్రెస్ ( Congress)  పార్టీ అధిష్టానంలో చలనం వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించింది. ఒక్కొక్క డివిజన్ కు ఒక మంత్రి, ఇద్దరు శాసన సభ్యులకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రజలను కలిశారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి లేకపోవడం, విద్యా వ్యాపారీకరణ వంటి అంశాలను సీఎం  ఎత్తి చూశారు. OBCలు, ముస్లింలు (Muslims)  మద్దతును  కాంగ్రెస్‌ కూడగట్టింది.   AIMIM కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. కానీ ఎన్నికల ప్రచారంలో  పాల్గొన లేదు. ఇదే తరుణంలో ముస్లీం ఓటర్లు చేజారకుండా మాజీ క్రికెటర్ అజారుద్దీన్​ కు  (Azarauddin)  అర్జెంటుగా మంత్రి పదవి ఇచ్చారు. కానీ కీలక పదవి ఇవ్వలేదని ముస్లీంలోనే మరో వర్గం ఆరోపించింది. ఇక  సామాజిక సంఘాలు యాదవ, (Yadava) గౌడ (Gowda) తదితర బీసీ సంఘాలు కాంగ్రెస్ వైపు తిరిగాయి.

బీఆర్ ఎస్ స్వయం కృతం

 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్  దెబ్బతింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleswaram Fail) విఫలం, లిక్కర్ స్కామ్ ( Liquor Scam), TSPSC పేపర్ లీక్‌లు, నిరుద్యోగం, పెన్షన్‌లు ఆలస్యం,  ఈ అసంతృప్తి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కూడా ప్రభావం చూపింది. 2023లో గోపీనాథ్ 43.94% ఓట్లతో గెలిచినా, మార్జిన్ 16,337 ఓట్లు మాత్రమే వచ్చాయి. చూపించింది. దీనికి తోడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  ( KTR) సోదరి కవిత ( Kavitha)  వ్యవహారం కూడా బీఆర్ఎస్ ను దెబ్బతీశాయి. సోదరిని పార్టీకి దూరం చేశారనే భావన కేడర్ లో పెరిగింది. ఈ స్థితిలో – బీఆర్ఎస్ క్యాడర్‌లో (Cadre)  ఆత్మవిశ్వాసం తగ్గింది.  2024 లోక్‌సభ ఎన్నికలలో   గెలుస్తామని కేటీఆర్ చెప్పినా, గ్రౌండ్ లెవల్‌ (Ground Level) లో మద్దతు తగ్గింది. కాంగ్రెస్  మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ( Model Code of  Condact )  ఉల్లంఘించారని, ( Cash Distribution) నగదు పంపిణీ చేశారని బీఆర్ఎస్ ఎంతగా ( So many alligations)  మొత్తుకున్నా.. జనం మాత్రం అధికార బలానికే తలొగ్గారు.

Leave a Reply