సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని శ్రీపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుంటి నారమ్మ చందర్నారాయణ చెప్పారు. తాను బీఆర్ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, యువనేత నాగం శశిధర్ రెడ్డి అండతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నానని తెలిపారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. గ్రామంలో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, రోడ్లు, లైట్లు తదితర సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ప్రజలు సానుకూలంగా ఉన్నారని చెప్పారు. తన భర్త చందర్నారాయణ, కుమారుడు సత్యం సహకారంతో గ్రామ ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి తమ కుటుంబం ముందుండబోతుందని నారమ్మ తెలిపారు. తమను బలపరిచి విజయవంతం చేయాలని, ఓటుహక్కును వినియోగించి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply