గౌతాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చుదిద్దుతా

  • మీ రుణం తీర్చుకునేందుకు సర్పంచుగా ఆదరించండి

తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూరు మండలం గౌతాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తనకు అవకాశం కల్పించాలని గ్రామ సర్పంచు అభ్యర్థి సుజాత రాజప్ప గౌడ్ కోరారు. ఈ రోజు గ్రామంలో తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు.

ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ రాజప్ప గౌడ్, నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళ కన్వినర్ శకుంతల దేశ్ పాండే, నేతలు, వార్డు సభ్యులు, యువకులు, మహిళలు కదిలివచ్చారు. ఇప్పటికే రెండు పర్యాయాలు తమను సర్పంచులుగా దీవించి గెలిపించిన మీకు నిత్యం అందుబాటులో ఉండి పనిచేశామని గుర్తుచేశారు.

పనిచేసే తమకు సర్పంచుగా అవకాశం కల్పించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిద్దేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. గ్రామంలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందామని, మరొక్కసారి మీ ఆశీర్వాదంతో సర్పంచుగా సుజాత రాజప్పగౌడ్ను గెలిపించాలని కోరారు.

ప్రచారానికి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడం చూస్తుంటే చాల సంతోషంగా ఉందని, భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

Leave a Reply