పవన్, సూరి మూవీ పై క్లారిటీ వచ్చేది ఎప్పుడు..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు, ఓజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. హరీష్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ షూటింగ్ వర్క్ కంప్లీట్ అయ్యింది. మిగిలిన షూటింగ్ పార్ట్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. పవన్, సురేందర్ రెడ్డి కాంబోలో మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ.. ఇంత వరకు పట్టాలెక్కలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అనే డౌట్ సినీ అభిమానుల్లో స్టార్ట్ అయ్యింది. అసలు ఏమైంది..?
సురేందర్ రెడ్డి.. అఖిల్ తో తీసిన ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దీంతో ఇంత వరకు సురేందర్ రెడ్డి నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది సెట్ కాలేదు. అయితే.. పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమాని ప్రకటించారు కానీ.. ఇంత వరకు ఈ ప్రాజెక్ట్ ఉందా..? లేదా..? అనేది సస్పెన్స్ గా ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి మూవీ ఉందని.. ఖచ్చితంగా ఈ మూవీ చేస్తానని మాట ఇచ్చారని వార్తలు వచ్చాయి. తాజాగా సురేందర్ రెడ్డి.. రవితేజతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే మరో వార్త లీకైంది. దీంతో పవన్ తో సూరి మూవీ ఏమైంది అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి వెంకీతో సినిమా చేయాలి అనుకున్నాడు. చాలా రోజులు కథ పై కసరత్తు చేశాడు. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అనుకుంటే.. లాస్ట్ మినిట్ లో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఆతర్వాత సూరి వెంకీ కోసం రెడీ చేసిన కథ మాస్ మహారాజా రవితేజకు చెబితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. కిక్, కిక్ 2 తర్వాత రవితేజ, సురేందర్ రెడ్డి కలిసి సినిమా అనగానే మాంచి కిక్ ఇచ్చే కాంబో అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. రవితేజతో సినిమా చేద్దామనుకుంటే.. పవన్ నుంచి పిలుపు వచ్చిందట. పవన్ తో సినిమా అంటే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. దీంతో పవన్ తో సినిమా చేయాలా..? రవితేజతో సినిమా చేయాలా..? అనే ఆలోచనలో పడ్డారట సురేందర్ రెడ్డి. త్వరలో పవన్ తో సూరికి మీటింగ్ ఉందట. ఈ మీటింగ్ తర్వాత సూరి సినిమా పై క్లారిటీ వస్తుందని సమాచారం.