”సవితు: వరేణ్యం భర్గహ ధీమహ
అనగా సూర్య భగానుడి యొక్క ఉత్తమ తేజ్జస్సును ద్యాసం చేస్తున్నాము అని అర్థం. ‘ధియో యోన: ప్రచోదయాత్’ అనగా సూర్యుని తెజ్జస్సు మన బుద్ధిని ప్రేరేపించునో, ఇది గాయత్రి మంత్రానికి అర్ధం. అనగా మన బుద్ధిని ప్రేరేపించేది. సూర్య భగవానుడి తేజస్సే. ‘ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్’ ఆరోగ్యాన్ని సూర్యుడి వలన పొందాలి. శరీరం, బుద్ధి బాగుండాలన్నా సూర్య భగవానుడిని ఆరాధించాలి. బుద్ధి తేజోరూపము, సూర్యుడు తేజోమయుడు, ధ్యానం అనేది బుద్ధిని పరమాత్మ యందు ఉంచుట. సక్రమంగా ధ్యానం జరగాలంటే సూర్య భగవానుడి కృప కావాలి. ఇలా సూర్యారాధన వలన బుద్ధిని అంటే పరమాత్మారాధన ద్వారా బుద్ధిని, మనసుని సక్రమంగా ప్రవర్తింప చేయవచ్చును.