అఖండ జ్యోతికి స్వాగతం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కోసం హైదరాబాదు యాదాద్రి భవన్ నుండి బయలుదేరిన అఖండ జ్యోతి కి రాయగిరిలో బుధవారం పలువురు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో ఆలేరుకు చెందిన సీనియర్ విద్యావేత్తలు గాదె సోమిరెడ్డి, మిట్టపల్లి విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
