Weather| ఆశ పెడుతున్న వాతావరణ శాఖ: నేటి నుంచి జోరుగా వానలంటూ సూచన

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంలో ఈసారి జోరువానలు ( heavy rains) ఉంటాయని తెలుగు ప్రజలు (telugu people) భావించారు. అందుకే మేలో (may month) తొలకరి జల్లులు కురవగానే పరవశించిపోయారు… రైతులు (Farmers) వ్యవసాయ పనులు ( cultivation) ప్రారంభించారు. కానీ ఎప్పటిలాగే వాతావరణం ( weather ) రైతుల ఆశల్ని ఆవిరిచేసింది… అసలైన వర్షాకాలంలో మేఘాలు ముఖం చాటేసాయి… జూన్ లో అసలు వర్షాలే లేవు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నెలలో లోటు వర్షపాతం నమోదయ్యింది. జూన్ పోతేపోయింది.. జులైలో అయినా భారీ వర్షాలుంటాయని ఆశించారు… కానీ ఈ నెలలో సగం రోజులు వర్షాలు లేకుండానే పూర్తయ్యాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెబుతోంది.

ఇవాళ్టి నుండి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకుంటాయని… భారీ వర్షాలు మొదలవుతాయని ఇప్పటికే ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడం… అల్పపీడనాలు, ఆవర్తనాలు, ద్రోణి వంటివి ఏర్పడుతూ వాతావరణం వర్షాలకు అనుకూలంగా మారిందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో తెలంగాణ గురువారం నుండి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇవాళ మొదలయ్యే వర్షాలు ఈనెలంతా కొనసాగుతాయని… భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలోని …

ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే వర్షాలు విస్తారంగా కురుస్తుండగా అవి కొనసాగుతాయని వెల్లడించారు. అలాగే వరంగల్, ఖమ్మం జిల్లాలోనూ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. హైదరాబాద్ లో కూడా ఇవాళ చిరుజల్లులు కురుస్తాయని… అక్కడక్కడ భారీ వర్షాలకు కూడా ఛాన్స్ ఉందట. నగరాన్ని ఆనుకునివున్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లోని ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఉదయం నుండి వాతావరణం చల్లగా ఉండి మధ్యాహ్నం లేదా సాయంత్రం వర్షాలు ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆంధ్ర ప్రదేశ్ లో…

ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి… ఇవి మరిన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ రాయలసీమ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయట… ఇక్కడ కూడా కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం సూచిస్తోంది.

Leave a Reply