తిమ్మాపూర్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా

ధర్మపురి, ఆంధ్రప్రభ : తిమ్మాపూర్ గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థి వావిలాల మమత జగదీష్ అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. సర్పంచ్‌గా ఒకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం అండతో మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామానికి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని హామీ ఇచ్చారు.

Leave a Reply