పారిశుద్ధ్య పనులు చేపట్టి దోమల బెడద నివారిస్తాం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఊట్కూర్ మండల కేంద్రంలోని 16 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి వేసవి కాలంలో దోమలబెడదనునివారించేందుకు పాలకవర్గం సభ్యులతో కలిసి కృషి చేస్తామని ఊట్కూర్ ఉప సర్పంచ్ రెడ్యానోళ్ళరమేష్ అన్నారు. శుక్రవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని 10వవార్డు పాతపేటలో చేపడుతున్నపారిశుద్ధ్యపనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజలు తడి పొడి చెత్త వేర్వేరుగా చెత్తా సేకరణ వాహనంలో వేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గన్ని బ్యాగులు వినియోగించాలన్నారు. వివిధ కాలనీలలో డ్రైనేజీల్లో తొలగిస్తున్న చెత్తాచెదారం గ్రామపంచాయతీ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నామనిఅన్నారు.
ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని ఊట్కూర్ మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. గ్రామంలో డ్రైనేజీలు సిసి రోడ్ల నిర్మాణానికి కృషి చేయడంతో పాటు ఎంపీ డీకే అరుణ నిధులు తీసుకువచ్చిగ్రామాభివృద్ధికికృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే విధంగా చూస్తామన్నారు. పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తానని అన్నారు. వార్డు సభ్యులు తమ కాలనీలలో నెలకొన్న సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిపి సిబ్బంది పోలప్ప, ఉదయ్, కనకప్ప, బాలకృష్ణ, పరశురాం, మార్కండేయ, తదితరులు పాల్గొన్నారు.
