Global Summit ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం..

Global Summit ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం..
- డిప్యుటీ సీఎం బట్టి విరమార్క
ఆంధ్రప్రభ , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, కందుకూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క్ అన్నారు. డిసెంబరు 8, 9న రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు.. ఆదివారం సాయంత్రం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా డిప్యుటీ సీఎం బట్టి మాట్లాడుతూ.. డిసెంబరు 8,9 రెండు రోజుల పాటు జరగనున్న సమ్మిట్ లో దేశ విదేశాల నుండి వచ్చే పారిశ్రామిక దిగ్గజాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రమిక ఇంకా ఇతర ప్రముఖులు పాల్గొననున్న నేపథ్యంలో 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అన్ని విభాగాలకు చెందిన అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమానికి సంబందించిన స్థలంలో భూమి చదును తదితర పనులు జరుగుతున్న తీరు డిప్యుటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పరిశీలించారు.
రెండు రోజుల పాటు జరిగే సమ్మిట్ ను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. అందుకు సంబంధంచి భారత్ ప్యూచర్ సిటీ తో పాటు సిటీ నాలువైపులా గచ్చి బౌలి, దుండిగల్, హైటెక్ సిటీ లలో అనువైన ప్రదేశం కోసం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు సందీప్ కుమార్, సుల్తానియా, వికాస్ రాజ్, శశాంక్, నర్సింహా రెడ్డి, కృష్ణ భాస్కర్, ముషారప్ అలీ, ప్రియాంక, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, తహసీల్దార్ గోపాల్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
