AP | 2029కి కార్పొరేట్ స్థాయి ఆస్పత్రిగాగా అభివృద్ధి చేస్తాం… టీ.జీ భరత్

పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టీ.జీ భరత్

61 లక్షల రూపాయల 2డి ఎకో కలర్ డాప్లర్ మిషన్ ను ప్రారంభించిన మంత్రి…


కర్నూలు బ్యూరో : 2029 సంవత్సరానికి కర్నూలు సర్వజన ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామ‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి.భరత్ అన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో క్రొత్త 2డి ఎకో కలర్ డాప్లర్ మిషన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ… ఈ 2డి ఎకో డాప్లర్ మిషన్ వలన ఒక నెల వయసు ఉన్న శిశువుకు ఉన్న గుండె సంబంధిత సమస్యలను కనుగొనే అవకాశం ఉంటుందన్నారు. దీనివలన చాలా ఉపయోగాలున్నాయని తెలిపారు. ఇక్కడ ప్రజలకు అవసరమైన చాలా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మన రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ సరికొత్త వైద్య పరికరాలను ఈ ఆసుపత్రికి సమకూర్చుకుంటూ 2029 సంవత్సరం నాటికి కర్నూలు సర్వజన ఆసుపత్రిని పూర్తిస్థాయి కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాయ‌ని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు ముఖ్య ఆస్పత్రిగా ఉన్న కర్నూలు సర్వజన ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేయటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ లు ప్రత్యేకంగా ఒక విజన్ పెట్టుకుని కృషి చేస్తున్నారని మంత్రి తెలియజేశారు. ఈనెల 19వ తారీఖున ఆరోగ్యశాఖ మంత్రి కర్నూలు క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శిస్తారని తెలియజేశారు.

ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… గతంలో ఉన్న మిషన్ 15 సంవత్సరాల వయసు గల వారికి ఉపయోగపడేదని, ఈ మిషన్ నెలలోపు పిల్లల ను కూడా పరీక్షించడానికి ఉపయోగపడుతుందని, మంత్రి సహకారంతో ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ మాట్లాడుతూ… ఈ మిషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, గుండెలో వాల్వులు మార్చే దానికి కూడా ఉపయోగపడుతుందని తెలియజేశారు. కార్డియాలజీ విభాగపు హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ మిషన్ మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా 61 లక్ష రూపాయల వెచ్చించి కొనడం జరిగిందని, దీని వలన చిన్నపిల్లల గుండె సంబంధిత అన్ని పరీక్షలు మనం ఇక్కడే చేసుకునే అవకాశముంద‌ని తెలిపారు.

ఈ సమావేశానికి ఆస్పత్రి సూపరింటెండెంట్, డాక్టర్ వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, కార్డియాలజీ విభాగ హెడ్, ప్రాఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ సూపరింటెండెంట్, డాక్టర్ శ్రీరాములు, డా.సీతారామయ్య, సి ఎస్ ఆర్ ఎమ్ ఓ, డాక్టర్.వెంకటేశ్వరరావు, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ డా.లక్మి బాయి, సంబంధిత డాక్టర్లు పాల్గొన్నారు.

కూటమి నేతల సమీక్ష…
కర్నూలు బ్యూరో : కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి అధ్యక్ష్యతన కర్నూలు జిల్లా ఎన్.డి.ఏ నాయకుల సమావేశం కర్నూలు నగరంలొని స్టేట్ గెస్ట్ హౌస్ లో మంగళవారం నిర్వహించారు. సమావేశానికి కర్నూలు జిల్లా ఇంచార్జి మంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ ముఖ్యులుగా హాజరయ్యారు.

ఈ స‌మావేశానికి పత్తికొండ శాసనసభ్యులు కె.ఇ.శ్యాం కుమార్, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వర రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే పి.వి.పార్థసారథి, ఆదోని నియోజకవర్గం ఇంచార్జీలు మీనాక్షి నాయుడు, మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ బి.వీరభద్ర గౌడ్, కుడా చైర్మన్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు నియోజకవర్గం మాజి ఇంచార్జి డి.విష్ణువర్ధన్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, ఆదోని నియోజకవర్గం నాయకులు ఉమాపతి నాయుడు, ఆలూరు నియోజకవర్గం నాయకులు వైకుంటం శివ ప్రసాద్, వైకుంటం జ్యోతి, రాష్ట్ర కురువ కార్పోరేషన్ చైర్మన్ ఎం.దేవేంద్రప్ప, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు వై.నాగేశ్వర రావు యాదవ్, నంద్యాల నాగేంద్ర, పోతురాజు రవికుమార్, రాష్ట్ర పార్టీ కార్యానిర్వాహక కార్యదర్శి షేక్ వహీద్ హుస్సేన్, జిల్లా పార్టీ అనుబంధ కమిటీ అధ్యక్ష్హులు సత్రం రామక్రిష్ణుడు, డి.జేంస్, అఫ్సర్ బాషల‌తో పాటు జనసేన నాయకులు చింతా సురేష్, హర్షద్, పవన్, బీజేపీ నాయకులు బాపురం పరమహంస రామక్రిష్ణ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *