హైకోర్టులో తేల్చుకుంటాం
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎలాంటి మెరిట్స్(merits లోపలికి వెళ్లలేదని ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న తెలిపారు. హైకోర్టు(High Court)లో కేసు ఉన్నందున హైకోర్టుకు వెళ్లమని సుప్రీంకోర్టు సూచించిందని పేర్కొన్నారు. ఇది సర్కార్ విజయం కాదని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాదు, హైదరాబాద్(Hyderabad)లోనే తేల్చుకుంటామన్నారు.
42 రిజర్వేషన్లు రాకపోతే బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేపు హైకోర్టులో ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత(Jayalalithaa ఢిల్లీలో కూర్చుని ప్రధానమంత్రిని ఒప్పించి పార్లమెంట్లో బిల్లును పాస్ చేసుకుని రిజర్వేషన్లు(Reservations) కల్పించారు, కానీ మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్న విషయం గ్రహిస్తే మంచిదని సూచించారు.
బీసీలను పిచ్చోళ్ళు చేస్తున్నారని దుయ్యబట్టారు. రెడ్డి సోదరులకు విజ్ఞప్తి బీసీలకు రిజర్వేషన్లు ఆపొద్దు.. ఒకవేళ ఆపితే తెలంగాణలో భారీ ఉద్యమం వస్తది. దాని పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వమే(State Govt. బాధ్యత వహించాల్సి ఉంటుందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.