CM RF | రూ.5 కోట్ల ఆర్థిక సహాయం అందించాం

CM RF | రూ.5 కోట్ల ఆర్థిక సహాయం అందించాం
మంత్రి కొల్లు రవీంద్ర
CM RF | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం అని, మచిలీపట్నం (Machilipatnam) నియోజకవర్గంలో సామాన్య ప్రజల వైద్య ఖర్చులకోసం పెద్ద ఎత్తున సీఎం ఆర్ ఎఫ్ కింద రూ.5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం మంత్రివర్యులు మచిలీపట్నం నగరంలోని బృందావన్ థియేటర్ వద్దగల తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం 26 మంది పేద ప్రజలకు రూ.15.63 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం (State Govt) ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కానటువంటి వైద్య ఖర్చులకు సంబంధించి పెద్ద ఎత్తున సామాన్య ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి( సీఎంఆర్ఎఫ్) ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటివరకు 455 మంది లబ్ధిదారులకు రూ.5 కోట్ల రూపాయల మేరకు ఇప్పటివరకు ఆర్థిక సహాయం అందజేశామన్నారు. ఈ ఒక్కరోజే 26 మందికి లబ్ధిదారులకు రూ.15.63 లక్షల రూపాయలు సీఎంఆర్ చెక్కులను బ్యాంకు చెక్కులను అందజేశామన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణి కుమార్, రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ లంకె నారాయణ ప్రసాద్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, అర్బన్ బ్యాంకు చైర్మన్ దిలీప్ కుమార్ (Dilip Kumar) కార్పొరేటర్లు అనిత, సమత కీర్తి, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక నాయకులు సోడిశెట్టి బాలాజీ, వెంకటస్వామి, ఇలియాస్ భాష, సుబ్రహ్మణ్యం, తదితర అనధికారులు పాల్గొన్నారు.
