బాపట్ల టౌన్ అక్టోబర్ 29 ఆంధ్రప్రభ : మొంథా తుఫాను సాకుతో వైఎస్ఆర్సిపి ప్రజల్లోకి వెళ్లేందుకు తుఫాను రాజకీయానికి తెరలేపింది. బుధవారం తుఫాను తీరం దాటి బాపట్లలో 1977 గాలి వానను మళ్లీ ప్రజలకు పరిచయం చేసింది. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నిర్విరామంగా అధికారులను అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు కల్పించారు. దగుదినమ్మ మీ సేవలు అంటూ వైయస్సార్సీపి నాయకులు పునరావస కేంద్రాలకు లోతట్టు ప్రాంత ప్రజల వద్దకు వెళ్లి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు.
ఉడతా భక్తి సాయం ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. బాధితుల కోసం రూపాయి వెచ్చించిన దాఖలాలు ఎక్కడా లేవు. కూటమి ప్రభుత్వం చేతిలో 11 సీట్లకే పరిమితమై మళ్లీ ప్రజల్లోకి ఏదో ఒక రకంగా వెళ్లాలనే ఉద్దేశంతో కొంతకాలం సూపర్ సిక్స్ పథకాల పై విమర్శల అస్త్రాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా పథకాలు అమలు చేయడంతో మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ వద్దు అంటూ నిరసనలతో ప్రజల్లోకి వెళ్తున్న తరుణం. ఇప్పుడు కొత్తగా మొంథా తుఫాను రాష్ట్రంలో తీరాన్ని తాకింది. ఈ నేపథ్యంలో మేమున్నామంటూ ప్రజల వద్దకు వైసీపీ నాయకులు తుఫాను రాజకీయాలకు నాంది పలికారు.

