Water Tank | వాటర్ ట్యాంక్ లీకేజీ..
- మరమ్మత్తులు చేపట్టండి
Water Tank | సదాశివనగర్, ఆంధ్రప్రభ : సదాశివనగర్ మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ సమీపంలో వాటర్ ట్యాంకు లీకేజీ సమస్య తలెత్తింది. గత కొంత కాలంగా వాటర్ ట్యాంక్ నుండి లీకేజీ(Leakage) ద్వారా ఎక్కువ నీళ్లు రోడ్డుపై వెళ్తున్నాయని కాలనీవాసులు తెలిపారు. గతంలో కూడా లీకేజీ కావడంతో మరమ్మత్తులు చేపట్టినట్లు తెలిపారు. నామమాత్రంగా మరమ్మతులు(Repairs) చేపట్టడంతో లీకేజీ సమస్య మళ్లీ తలెత్తిందని స్థానికులు అంటున్నారు. లీకేజీ ద్వారా నీళ్లు వెళ్లిపోవడంతో నీటి కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వాటర్ ట్యాంకు లీకేజీకి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

