Water Dispute : 16న కేంద్ర మంత్రి వద్ద రేవంత్, చంద్రబాబు పంచాయతీ

ఢిల్లీ జల వివాదంపై చర్చకు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16న ఢిల్లీ లో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ నేతృత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కావాలని కేంద్రం కోరింది.

ఈ మేరకు వీరిద్దరిని ఆహ్వానిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ సర్క్యులర్‌ విడుదల చేసింది. ఈ భేటీకి హాజరయ్యేందుకు ఇద్దరు సీఎంలకు వీలవుతుందో లేదో తెలపాలని పేర్కొంది.

మరోవైపు కృష్ణా, గోదావరి వాటాల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై రాష్ట్రంలోని ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ ఇవ్వాలని, నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని సీఎం కోరనున్నారు.

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన అక్కడికి చేరుకోనున్నారు. కేంద్రమంత్రులు అమిత్‌షా, అశ్వినీ వైష్ణవ్‌, సీఆర్‌ పాటిల్‌తో సమావేశం కానున్నారు. ఈనెల 17న రాత్రి 9 గంటలకు తిరిగి విజయవాడకు చంద్రబాబు చేరుకోనున్నారు.

Leave a Reply