water | సాగునీరు వృధా కాకుండా చేస్తాం..

water | సాగునీరు వృధా కాకుండా చేస్తాం..
- ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన అధికారులు
- ఆంధ్రప్రభ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు
water | టేకుమట్ల, ఆంధ్రప్రభ : కాలువల నిర్వహణ లోపం వల్ల నీటిపారుదల వ్యవస్థలో కొన్ని ప్రాంతాల్లో నీటి వృధా జరుగుతుంది. అది భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వేలంపల్లి, కుందనపల్లి తదితర గ్రామాలలో కాలువల పిచ్చి మొక్కలతో నిండిపోయి మరమ్మతులకు నోచుకోకపోవడంతో నీటిని విడుదల చేసిన కూడా వృధాగా పోతున్నాయి.
అనే శీర్షిక ఆంధ్ర ప్రభలో ఇటీవల ప్రచురితమైన విషము విధేయతమే కాగా వెంటనే వర్క్ ఇన్స్పెక్టర్ ఉదయ్, లస్కర్ సురేష్ లు ఆ కాలువలను పరిశీలించి విచ్చలవిడిగా వృధాగా పోతున్న సాగునీరును పరిశీలించి తక్షణమే సాగునీరును వృధా కాకుండా రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తామని తెలిపారు దీంతో ఆ గ్రామాల రైతులు నిజాన్ని నిర్భయంగా రాసే ఆంధ్రప్రభ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.

