warning | నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు…

warning | నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు…

కుబీర్ లో 16వ విడత ప్రజా వేదిక
ఎఫ్ ఏ, టి ఏ, పంచాయతీ కార్యదర్శుల నుండి రూ. 42.648 రికవరీ కి ఆదేశం
అక్రమాలకు ఉద్యోగాలకు ఎసరు
జాగ్రత్తగా మసులుకోవాలని డిఆర్డీఏ విజయలక్ష్మి హెచ్చరిక

warning | కుభీర్, ఆంధ్రప్రభ : ప్రతి గ్రామపంచాయతీలో ముందుగా నర్సరీల పనులను చేపట్టాలని నర్సరీలపై నిర్లక్ష్యం వహించే ఎఫ్ ఏ, టిఏ ల పై చర్యలు తప్పవని డిఆర్డిఏ విజయలక్ష్మి హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రం లోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2024 25 సంవత్సరానికి సంబంధించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక సామాజిక తనిఖీ ప్రజావేదిక డిఆర్డిఓ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. 42 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సామాజిక తనిఖీ బృందాల నివేదికల సమర్పణ సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. ఒక్కో జిపి కి సంబంధించిన నివేదికలను ఆయా జీపీల డిఆర్పిలు చదివి అధికారుల దృష్టికి చేసిన తప్పులను నివేదిక రూపంలో చదివి వినిపించారు.


మండలంలో ప్రధానంగా సమతల కందకాలు, చెరువులో పూడికతీత, సిసి రోడ్లు, 11 సేద్యపు బావులు, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మాణం తో పాటు పలు పనులను చేపట్టారని డిఆర్డిఓ విజయలక్ష్మి తెలిపారు. కాగా ఇందుకోసం రూ. 11.5 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఇందులో రూ.పదిన్నర కోట్లు కూలీలకు చెల్లించగా కేవలం రూ. 87.5 లక్షలు మాత్రమే మెటీరియల్ పేమెంట్ కు చెల్లించినట్లు తెలిపారు. అక్కడక్కడ ఈజీఎస్ సిబ్బందితోపాటు పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం కారణంగా నిర్లక్ష్యం కారణంగా చేసిన తప్పులకు గాను వారి నుండి రూ. 43 వేల రిపరికి ఆదేశిస్తున్నానని తెలిపారు. ఎఫ్ఎంసీ సమావేశాలు, రోజ్గార్ దివస్ రిజిస్టర్లను తప్పకుండా మెయింటెనెన్స్ చేయాలని సూచించారు. మార్చి నుండి ఎఫ్ ఆర్ ఎస్ వస్తుందని గ్రామాల్లో కూలీల సంఖ్యను పెంచి రూ. 307 కూలి డబ్బులు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు.


నర్సరీలలో పూల మొక్కలు, సుందరీకరణ మొక్కలు కాకుండా కరివేపాకు, రావి, వేప, ఈత, ఉసిరి, నిమ్మ, వాక్కాయ, నారింజ తదితర ముక్కలు తప్పకుండా ఉండేట్లు చూసుకోవాలన్నారు. నర్సరీ పనులను తూతూ ముద్రంగా నిర్వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పలువురు ఎఫ్ఏ లు తమ పనితీరును మార్చుకోవాలని లేని పక్షంలో మున్ముందు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ప్రజా వేదిక కార్యక్రమంలో ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి, హెచ్ ఆర్ మేనేజర్ సుధాకర్, ఎస్ టి ఏం దత్తు ఎస్ఆర్పి మహేష్ ఏపిఎం రాథోడ్ హరిలాల్, టిఏలు, ఎఫ్ఏ లు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాలకు కూలీలు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply