కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతోనే వార్డు అభివృద్ధి – రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్..

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతోనే వార్డు అభివృద్ధి – రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్..

నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : 38వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నాందేడపు అన్నపూర్ణ చిన్ను గెలుపుతోనే వార్డు అభివృద్ధి జరుగుతుందని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఎన్నికల్లో ప్రచారలో భాగంగా బుధవార్ పేట్ లో శనివారం రాత్రి ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున నిర్మల్ మున్సిపాలిటీలో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కౌన్సిల్ కు పంపించే బాధ్యత ప్రజల పై ఉందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దొందు దొందేనని అభివృద్ధి నిరోధక పార్టీలను గెలిపిస్తే.. తమ ఓటు వృధా అవుతుందని ఆయన ఓటర్లకు చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply