Warangal | ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ సస్పెండ్

Warangal | ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ సస్పెండ్

సీరియస్ గా స్పందించిన పోలీస్ కమిషనర్
ఉత్తర్వులు జారీ చేసిన సన్ ప్రీత్ సింగ్


Warangal | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడ్డ పోలీస్ అధికారులపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ (Sunpreet Singh) సస్పెన్షన్ వేటు వేశారు. పోలీస్ ఆఫీసర్ల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండటం, జవాబుదారీతనం, పారదర్శక పాలన అందించకపోవడంపై కొత్వాల్ సీరియస్ గా స్పందించారు.

మామూనూరు పోలీస్ స్టేషన్ నుంచి కంట్రోల్ రూమ్ కు ఇటీవలే బదిలీ అయిన ఇన్స్ స్పెక్టర్ ఒంటేరు.రమేష్ తో పాటు, మామూనూర్ కానిస్టేబుల్ జి.రఘును బుధవారం సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal Police Commissioner) సన్ ప్రీత్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన ఇరువురు మామూనూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సమయంలో వీరిపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీస్ డిపార్ట్ మెంట్ పరంగా అంతర్గత విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు సస్పెన్షన్ (suspended) వేటు వేశారు. పోలీస్ అధికారులు జరిపిన విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో పాటు వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో పోలీస్ కమిషనర్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply