Voting rights | ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధం..

Voting rights | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ఊట్కూర్ తాసిల్దార్ చింతా రవి అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ తాసిల్దార్ కార్యాలయం వద్ద జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతంగా తమ పాలకులను ఎన్నుకునేందుకు రాజ్యాంగం ఓటు హక్కు కల్పించిందని అన్నారు.
ఓటు హక్కు వినిగించుకునేందుకు కల్పించిన తమ హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేసే పాలకులను ఎన్నుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో కులం మతం జాతి వర్గ భాష ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మల్లేపల్లి సర్పంచ్ కథలప్ప, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్రారెడ్డి, ఆర్ ఐ కృష్ణారెడ్డి, జీపీఓలు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
