Voter’s Pledge | కలెక్టరేట్‌లో ఓటరు ప్రతిజ్ఞ

Voter’s Pledge | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ పాల్గొని జిల్లా అధికారులు, కలెక్టరేట్ వివిధ విభాగాల సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
ఓటరు ప్రతిజ్ఞ…
భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుతూ, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల పవిత్రతను నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు లోనుకాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగిస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
