VOTERS | ప్రచారంలో దూసుకెళ్తున్న రెడ్డి బేబీ కుమారి

VOTERS | ప్రచారంలో దూసుకెళ్తున్న రెడ్డి బేబీ కుమారి
VOTERS | ములకలపల్లి, ఆంధ్రప్రభ ; ఈనెల 14న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో మండల కేంద్రమైన ములకలపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టిఆర్ఎస్, టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు బలపరిచిన అభ్యర్థి రెడ్డి బేబి కుమారి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ములకలపల్లి గ్రామపంచాయతీ ఇంటింటి ఎన్నికల విస్తృత ప్రచారంలో టిడిపి, టిఆర్ఎస్, బిజెపి, జనసేన, బలపరిచిన తెలుగుదేశం సర్పంచ్ అభ్యర్థి రెడ్డి బేబి కుమారి గడప గడప ప్రచారంలో వినూత్న రీతిలో ఓటర్ల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే విధానం ఆకట్టుకుంది. ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడుతూ… అమలుకు సాధ్యం కానీ ఆరు గ్యారెంటీలతో 420 హామీలతో 420 మాటలు చెప్పి గద్దెనెక్కిన అధికార కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, ఇకనైనా ఓటర్లుమేలుకొని గ్రామపంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్, బిజెపి, జనసేన పార్టీల ఆశీస్సులతో సర్పంచిగా పోటీ చేస్తున్నానన్నారు.
తనను గెలిపిస్తే ప్రధాన సమస్యలు త్రాగునీరు, వీధిలైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరిస్తానన్నారు. తాను స్థానికురాలిని ప్రజల సమస్యలు తెలిసిన దానిని మీ ఆడబిడ్డని నన్ను ఆదరిస్తే మొలకలపల్లి గ్రామపంచాయతీని ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతానని ఆమె ఓటర్ల ముందు వాగ్దానం చేసి ఓటు అడుగుతున్నారు. అంతేగాక తనతోపాటు 14 వార్డ్ మెంబర్లను గెలిపించాలని ఈ గడప గడప ప్రచారంలో భాగంగా టిడిపి మండల అధ్యక్షులు తేల చెన్నయ్య మాట్లాడుతూ… టిడిపి, బిఆర్ఎస్, బిజెపి, జనసేన బలపరిచిన టిడిపి సర్పంచ్ రెడ్డి బేబీ కుమారిని గెలిపిస్తే తన సొంత ఖర్చుల 50 వేల రూపాయల వ్యయంతో కోతుల నిర్మూలనకు బోనులు ఏర్పాటు చేస్తానని వారు హామీ ఇచ్చారు.

ఈ ములకలపల్లి మండలంలో 50% మంది విద్యార్థినీ విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పిన ఉత్తమ ఉపాధ్యాయుడుగా సేవలందించి ఎంతోమందికి ద్రోణాచార్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేల చెన్నయ్య మండల ప్రజలకు సుపరిచితుడు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి రెండు సంవత్సరాలు పూర్తయినా ఏ ఒక్క ఎన్నికల హామీలు పూర్తిగా అమలు చేయలేని అసమర్ధ కాంగ్రెస్ పాలనను ఎండ కట్టాలన్నారు. గ్రామాభివృద్ధి చేసే అభ్యర్థి రెడ్డి బేబి కుమారిని గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు శనగపాటి సీతారాములు, పుష్పాల చందర్రావు, కొండవీటి రాజారావు, పుష్పాల హనుమంత్ , పువ్వాల రమేష్, రఘుపతి, టిడిపి నాయకులు జబ్బార్, మర్రి బాబు, బీజేపీ నాయకులు, జనసేన మండల అధ్యక్షులు తాటికొండ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, మండల నాయకులు, మహిళలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
