VOTE | ఒక్కసారి అవకాశం ఇవ్వండి..

VOTE | ఒక్కసారి అవకాశం ఇవ్వండి..

  • మొగిలిగిద్దను సుందరంగా తీర్చిదిద్దుతా
  • నేను మీ సేవకున్ని నన్ను ఆదరించండి
  • ఆదరించండి.. కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి


సర్పంచ్ అభ్యర్థి బుగ్గ కృష్ణ
VOTE | షాద్ నగర్, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. మొగలిగిద్దను సుందరంగా తీర్చిదిద్దుతానని మొగిలిగిద్ద గ్రామ సర్పంచ్ అభ్యర్థి బుగ్గ కృష్ణ అన్నారు. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి.. మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి తమకు ఓటు (VOTE) వేయాలని అభ్యర్థించారు.

ఆయన వెంట ప్రజలు తండోపతండాలుగా కదలివచ్చారు. గ్రామంలో దేవాలయాల అభివృద్ధి, సీసీ రోడ్లు, వీధిలైట్లు, నీటి సరఫరా, మౌలిక సదుపాయాలతో పాటు గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. యువతకు తమ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో ఉద్యోగ (Job) అవకాశాలు కల్పిస్తానని పేర్కొన్నారు. త‌నను ఆదరించి కత్తెర గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Leave a Reply