Volleyball | టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం

Volleyball | టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం
Volleyball | మునుగోడు, ఆంధ్రప్రభ: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా మునుకోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో గత రెండు రోజులుగా నిర్వహించిన మునుగోడు టౌన్ వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా ముగిసాయి. స్థానిక యువత భారీ సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. ఈరోజు టోర్నమెంట్లో ప్రథమ స్థానం దక్కించుకున్నలక్ష్మీదేవి గూడెం లయన్స్ జట్టుకు షీల్డ్, నగదు రూ.10,000 ,ద్వితీయ స్థానం సాధించిన మునుగోడు టైటాన్స్ జట్టుకు షీల్డ్,నగదు రూ.7,000 లను సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్, టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి నారబోయిన రవి ముదిరాజు,మాజీ ఉపసర్పంచ్ పాల్వాయి జూనియర్ గోవర్ధన్ రెడ్డిలు విజేతలకు అందజేశారు.
క్రీడలు యువతలో ఐక్యత, క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. మునుగోడు ప్రాంతానికి చెందిన క్రీడాకారులు జిల్లా,రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. క్రీడల నిర్వహణకు తోడ్పడిన దాతలను శాలువాలతో సత్కరించారు.
