Visible Policing | జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు

Visible Policing | జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు

  • రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

Visible Policing | కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ముమ్మర వాహన తనిఖీలు మరియు ‘విజిబుల్ పోలీసింగ్’ నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడం మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా అన్ని రకాల వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి, పొల్యూషన్ మరియు ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై, ముఖ్యంగా హెల్మెట్ ధరించని వాహనదారులపై భారీగా చలాన్లు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి, వారి వాహనాలను సీజ్ చేయడంతో పాటు కఠిన కేసులు నమోదు చేశారు. గంజాయి, మద్యం మరియు ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణా జరగకుండా వాహనాల డిక్కీలను, అనుమానాస్పద వ్యక్తుల బ్యాగులను తనిఖీ చేశారు.

Visible Policing |

ప్రజల రక్షణే పోలీసుల ప్రాధాన్యత అని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టవద్దని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Leave a Reply