‘విశ్వంభర’ అప్‌డేట్‌.. స్పెషల్‌ వీడియో విడుదల చేసిన చిరు

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ ‘విశ్వంభర’ (Vishwambhara). తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై చిరంజీవి అప్‌డేట్‌ ఇచ్చారు. దీని ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు. ‘‘విశ్వంభర ఎందుకు ఆలస్యమవుతుందని చాలామందికి అనుమానం ఉంది. ఆ జాప్యం సముచితమని నేను (Chiranjeevi) భావిస్తున్నాను. ఈ సినిమా సెకండ్‌హాఫ్‌ మొత్తం వీఎఫ్‌ఎక్స్ మీద ఆధారపడి ఉంది. దీన్ని అత్యుత్తమంగా మీకు అందించాలనే ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధాన కారణం. ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం.

ఈ సినిమా చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది. దీని గ్లింప్స్‌ను ఆగస్టు 21 సాయంత్రం 6.06కు విడుదల చేస్తున్నారు (MEGA BLAST Announcement). ఇక ఈ సినిమాను అందరూ ఎంజాయ్‌ చేసేలా దీన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తారు. 2026 సమ్మర్‌లో ఎంజాయ్‌ చేయండి’’ అని తెలిపారు (Vishwambhara Release Date).

చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్‌ నటించారు. కునాల్‌ కపూర్‌ ముఖ్య భూమిక పోషించారు. బాలీవుడ్‌ తార మౌనిరాయ్‌ ప్రత్యేక గీతంలో మెరవనున్నారు. వంద మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారు. దీంతో ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది (Vishwambhara Special Song). చిరు, మౌనిరాయ్‌ ఇద్దరూ భీమ్స్‌ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటతో థియేటర్‌లో జోష్‌ నింపనున్నారు.

Leave a Reply