Vishnupriya | డ‌బ్బుకోసం క‌క్కుర్తి

Vishnupriya | డ‌బ్బుకోసం క‌క్కుర్తి

Vishnupriya | ఆంధ్రప్ర‌భ వెబ్‌డెస్క్ : డ‌బ్బు సంపాదించ‌డానికి ఎన్నో మార్గాలున్నాయి. అయితే శరీరాన్ని ఎరగా చూపి సంపాదించాల‌నుకోవ‌డం దారుణం. యాకంర్‌, న‌టి విష్ణుప్రియ ఎంచుకున్న ‘సబ్స్క్రిప్షన్స విధానం యువతను పెడదోవ ప‌ట్టించేలా ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

యాంకర్ విష్ణుప్రియ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. త‌న గ్లామర్ డోస్‌ను పెంచి ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తూ కుర్ర‌కారును వెర్రెత్తిస్తోంది. అంత‌టితో ఆగ‌కుండా తన గ్లామర్ ప్రదర్శనలను చూడాలంటే డబ్బులు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటూ ఇన్ స్టాగ్రామ్‌లో ప్రచారం చేయ‌డం మొదలుపెట్టింది. గతంలోనే బెట్టింగ్ యాప్స్ వివాదంలో చిక్కుకున్న ఈమె, ఇప్పుడు ఇలా చేయ‌డంపూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పైస‌ల సంపాద‌న కోసం ఇంత‌గా దిగ‌జారాలా అని మండిప‌డుతున్నారు.

ఈ విష‌యంలో విద్యార్థి సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. శనివారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ ఆధ్వర్యంలో నాయకులు సూర్యరావుపేట సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి యువతను పక్కదోవ పట్టిస్తున్న విష్ణుప్రియ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కంప్ల‌యింట్ ఇచ్చారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు, అశ్లీలతను ప్రోత్సహిస్తున్న ఆమె ఇన్ స్టాగ్రామ్ ఖాతాను వెంటనే బ్లాక్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.

Leave a Reply