పారిశుధ్య కార్మికుల కృషితోనే గ్రామం పరిశుభ్రం..

పారిశుధ్య కార్మికుల కృషితోనే గ్రామం పరిశుభ్రం..
- గ్రామ సర్పంచ్ మందపురం రాణి అనిల్ గౌడ్
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : పారిశుధ్య కార్మికుల కృషితోనే గ్రామం పరిశుభ్రంగా ఉంటుంది.. కార్మికుల సేవలకు గ్రామం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని గ్రామ సర్పంచ్ మందపురం రాణి అనిల్ గౌడ్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ మండ లం ఇప్పగూడెం గ్రామంలో ఆదివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ మందపురం రాణి అనిల్ గౌడ్ ఆధ్వ ర్యంలో పాలకవర్గ సభ్యులతో కలిసి పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులైన సబ్బులు, కొబ్బరి నూనె, షాంపూలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ..గ్రామ పరిశుభ్రతతో పాటు అభి వృద్ధి పనులను కూడా వేగవంతంగా చేపడుతున్నామని తెలిపారు.
గ్రామం ఆరోగ్యంగా ఉండటంలో పారిశుధ్య కార్మికుల కృషి ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగం గా రాబోయే రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి యుగంధర్, ఉప సర్పంచ్ లింగనబోయిన రాజు, వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
