ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తథ్యం

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తథ్యం

  • విజేత స్టడీ సర్కిల్ విద్యావేత్త విజేత వెంకట్ రెడ్డి

ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించి తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం పాటుపడాలని విజేత స్టడీ సర్కిల్ విద్యావేత్త వెంకట్ రెడ్డి సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయంతత్యమన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ప్రేరణ తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇష్టపడి చదివితే అన్ని విషయ అంశాలు అర్థమవుతాయని అన్నారు. విద్యార్థులు పరీక్షల పట్ల భయం వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించడంతోపాటు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తారని వారి కలలను నెరవేర్చాలన్నారు. మనిషి అనుకుంటేసాధించలేనిది ఏదీ ఉండదని ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాలన్నారు.

విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో భయం లేకుండా నిర్భయంగా వ్రాయాలని వివిధ మెలకువలు పాటించాలన్నారు. పదవ తరగతి విద్యార్థులకు చేపట్టిన ప్రేరణ తరగతులు విద్యావేత్త చేపట్టిన పలు అంశాలు విద్యార్థులనుఆకట్టుకున్నాయి. టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశ్యంతో పాఠశాలకు పంపిస్తారో వారి ఆశయాలను నెరవేర్చే దిశగా ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలన్నారు.పరీక్షలంటే భయం లేకుండా వ్రాయాలని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని,భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండాలని అన్నారు.

జిల్లా ఉపాధ్యక్షులు బాలాజీ మాట్లాడుతూ అబ్దుల్ కలాం యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొనిచదువుకోవాలని ,క్రమశిక్షణతో చదివి ప్రతిభ కనబర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నపొర్ల సర్పంచ్ నికిత ప్రశాంత్,ఉప సర్పంచ్ సంజీవ్, విశ్రాంత జిహెచ్ఎం,భాస్కర్ రెడ్డి పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు నరేందర్, టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు,రాజు,మోహన్, యుటిఎఫ్ జిల్లా నాయకులు శంకర్,పాఠశాల ఉపాధ్యాయ బృందం శేషప్ప,తిరుపతి నాయక్,ఆనంద్,స్వప్న,శ్రీనివాసులు,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply