వ్యర్ధ రహిత సమాజాన్ని నిర్మిద్దాం…

వ్యర్ధ రహిత సమాజాన్ని నిర్మిద్దాం…

విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర

విజయవాడ కార్పోరేషన్, ఆంధ్ర ప్రభ : వ్యర్ధ రహిత సమాజాన్ని నిర్మించాలని పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని, శనివారం ఉదయం వాంబే కాలనీలో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరుపుకుంటున్నామని ఈ కార్యక్రమంలో స్వచ్ఛ సర్వేక్షన్ లో విజయవాడ నగర పాలక సంస్థ వేరే రాష్ట్రా లలో నగరాల కంటే ఒక అడుగు ముందుంటుందని, ఈ నెల స్వర్ణాంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అంశం ” వ్యర్థ రహిత సంస్థలు” గా ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుపుకుంటున్నామని అన్నారు.

వ్యర్థ రహిత సంస్థలుగా విజయవాడ నగర పాలక సంస్థ ఉండాలంటే ప్రతి ఒక్క సంస్థ అవి పాఠశాలలు కావచ్చు ఉద్యోగ వ్యవస్థలు కావచ్చు నగరంలో ఉండే ప్రతి ఒక్క సంస్థ లో వ్యర్ధాలను సక్రమంగా నిర్వహించటం అని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం వల్ల చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అన్ని అంశాలపై అన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. తదుపరి అక్కడికి వచ్చిన వారికి యాంటి లార్వే ఆపరేషన్లు, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధం పర్యావరణహితమైన వస్తువులనే వాడటం, ఇంటిలోనే ఎరుగలను తయారు చేసుకోవడం, మిద్ది పైన కూరగాయలను పండించడం వంటి అంశాలపై అవగాహన కల్పించే స్టాల్స్ ను పరిశీలించారు.

వ్యర్ధ రహిత సంస్థల కొరకు ప్రజలందరికి అవగాహన కల్పించే విధంగా ర్యాలీ ద్వారా నినాదాలతో స్వర్ణాంధ్ర స్వచంద్ర కార్యక్రమం ర్యాలీని కమిషనర్ ధ్యాన చంద్ర జండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు, విద్యార్థులు, వ్యర్ధాలను ఎలా నిర్వహించాలి, తడి చెత్త పొడి చెత్త ఎలా వేరు చేయాలి అంటే అంశాలపై నినాదాలతో ఆ ప్రాంతంలో గల సంస్థలకు ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, జోనల్ కమిషనర్కె . ప్రభుదాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) ఎం. విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సి డి వో జగదీశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply